హైదరాబాద్ కానిస్టేబుల్ ప్రపంచ రికార్డ్!

TG: హైదరాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్ వి. సుధాకర్ అరుదైన వరల్డ్ రికార్డు సాధించారు. నేషనల్ లెవెల్ కరాటే స్పోర్ట్స్‌మెన్ సుధాకర్ 9 రకాల కరాటే టెక్నిక్‌లతో 80 షాబాద్ టైల్స్‌ను బద్దలు కొట్టారు. ‘మిషన్-80’ పేరుతో GVR కరాటే అకాడమీ ఏర్పాటు చేసిన డాక్టర్ GS మెల్కోటే పార్క్‌లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. 8 నిమిషాల టైమ్ ఇవ్వగా.. కేవలం 3 నిమిషాల 26 సెకన్లలోనే టార్గెట్‌ని పూర్తి చేశారు. Wonder Book of Records International పర్యవేక్షణలో ఈ రికార్డు సాధించారు.



