రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని రోటరీ క్లబ్ సభ్యులు సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని మిద్దె సెంటర్‌లో మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనం వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. అందుకే పర్యావరణహితమైన మట్టి వినాయక ప్రతిమలను ఉపయోగించాలని కోరారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.