పేద విద్యార్థినికి తీన్మార్ మల్లన్న సాయం

కోస్గి మండలం కడంపల్లిలో ఇంటర్ బైపీసీలో 948 మార్కులు సాధించిన కావలి అన్నపూర్ణ అనే విద్యార్థిని, డబ్బులు లేక BSc MLT చదువుకోలేకపోతోంది. బీసీ రాజ్యాధికార యాత్రలో ఈ విషయం తెలుసుకున్న తీన్మార్ మల్లన్న వెంటనే ఆమె ఇంటికి వెళ్లారు. హయ్యర్ స్టడీస్ కోసం లక్ష రూపాయిల ఆర్థిక సాయం అందించి ధైర్యం చెప్పారు. పేద విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ అందించడమే తమ గోల్ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.



