← Back to news

పంచాయతీ కార్యాలయంలోకి తాచుపాము

By malluru chandrashekar· 2h ago· Khammam

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం త్రాచుపాము కలకలం రేపింది. విధుల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శి వేము రామకృష్ణ కూర్చున్న చోటుకు సమీపంగా పాము రావడంతో ఆయన అప్రమత్తమై వెంటనే పక్కకు తప్పుకున్నారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. కార్యదర్శి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

More in Local