విశాఖలో టెక్రిట్జ్ 2కే26 మొదలు

విశాఖలోని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ కళాశాలలో గురువారం జాతీయ స్థాయి మహిళా టెక్ ఫెస్ట్ 'టెక్రిట్జ్ 2కే26' ప్రారంభమైంది. 'ఏజెంటిక్ ఏఐ యుగం' ఇతివృత్తంతో రెండు రోజుల పాటు సాగే ఈ వేడుకలో నగర కళాశాలల నుంచి సుమారు 4,800 మంది పాల్గొంటున్నారు. ప్రాజెక్టు ఎక్స్పో, హ్యాకథాన్, కోడింగ్ పోటీలు, పేపర్ ప్రజెంటేషన్లు, వర్క్షాప్ నిర్వహిస్తున్నారు.



