ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. హోటళ్లకు నోటీసులు!

సూర్యాపేట జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లపై దాడులు చేశారు. అపరిశుభ్రత, సరైన శుభ్రత లేకపోవడం గుర్తించారు. అనుమానాస్పద ఆహార పదార్థాల నమూనాలు ల్యాబ్‌కు పంపారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటారు. లోపాలపై 7 మిడ్‌వే ప్లాజా రాయగూడెం, లిటిల్ విలేజ్ బిర్యానీ, అన్నపూర్ణ మెస్‌లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేయాలని సిఫార్సు చేశారు. వంటగదులు, ఫ్రిడ్జ్‌లు, నిల్వ ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని, ఆహారాన్ని కీటకాలు, ఫంగస్ నుంచి కాపాడాలని సూచించారు.



