డేటా వద్దా? ఇక కాల్స్, SMSకే ప్రత్యేక రీఛార్జ్!

ఇంటర్నెట్ డేటా అవసరం లేని మొబైల్ యూజర్లకు TRAI కొత్త రూల్స్ తీసుకొచ్చింది. టెలికాం కంపెనీలు కేవలం కాల్స్, SMS కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు ఇవ్వాలి. డేటా అవసరం లేకపోయినా డేటా ఉన్న ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. 30 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలానికి కూడా ఇలాంటి ప్లాన్ అందుబాటులో ఉండాలి. కొత్త రూల్స్ గెజిట్‌లో ప్రచురించిన 30 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి.


