← Back to news

అట్ల బతుకమ్మ.. జనసేన కార్యాలయంలో సందడి!

By SKR· 2h ago· Sri Ramanjaneya Nagar Colony, Kothagudem, Bhadradri Kothagudem
అట్ల బతుకమ్మ.. జనసేన కార్యాలయంలో సందడి!

కొత్తగూడెం విద్యానగర్ జనసేన కార్యాలయంలో అట్ల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. డాక్టర్ జీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రతినిధి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ వేడుకలు నిర్వహించారు. అట్లు, ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి కుటుంబ సుఖసంతోషాల కోసం ప్రార్థించారు. బతుకమ్మ పాటలు, ఆటలతో సందడి చేశారు. తొమ్మిది రోజుల ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.

More in Local