AP వెదర్ అప్డేట్.. 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్!

AP: రాష్ట్రంలో అక్టోబర్ 14 - 16 వరకు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్ MD ప్రఖర్ జైన్ తెలిపారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడతాయన్నారు. 14న 11 జిల్లాల్లో, 15న కోనసీమ, కృష్ణా జిల్లాల్లో, 16న అల్లూరి, పోలవరం జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. మిగతా ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షాలు పడొచ్చని తెలిపారు. చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ దగ్గర నిలబడొద్దని హెచ్చరించారు.



