CHCలో బెడ్లు, సెలైన్ స్టాండ్లు ఏవీ?

TG: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్(CHC)లో కనీస సౌకర్యాలు లేవని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలైన్ ఎక్కించేందుకు బెడ్లు, సెలైన్ స్టాండ్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. మండలంలోని పలు గ్రామాల నుంచి పేద, మధ్యతరగతి ప్రజలు ఈ హాస్పిటల్‌కి వస్తుంటారు. హాస్పిటల్‌లో బెడ్లు, సెలైన్ స్టాండ్లు, ఇతర మెషినరీలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు


