గొర్రెల కాపర్ల సమస్యలను తెలుసుకున్న సీపీఎం నేతలు

కరువు ప్రభావంతో పశుపోషకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో కరవు పరిస్థితులపై సీపీఎం చేపట్టిన యాత్ర రెండోరోజు ఆదివారం కోడికొండ చెక్‌పోస్ట్ వద్ద ప్రారంభమైంది. గొర్రెల కాపర్లతో శ్రీనివాసులు మాట్లాడి పశువులకు మేత, నీటి లభ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరవు కారణంగా పశుపోషకులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించారు.



