ఐలమ్మను తెలంగాణ తల్లిగా ప్రకటించాలి!

వీరనారి చాకలి ఐలమ్మను ‘తెలంగాణ తల్లి’గా ప్రకటించాలని బహుజన నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ మండలంలోని ఐలమ్మ విగ్రహానికి బెజ్జోర లావణ్య, మమత మాలజీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఆమె పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఉమేష్ మహరాజ్, జాంబవ చమార్, డి.ఎల్ లింగం, అంగుళి మాలజీ, బి.రత్నం, జిన్నా విజయ్, భీంసేన్ మహరాజ్, మామిడి గంగు, ఎం.ఆరాధ్య పాల్గొన్నారు.




