← Back to news

వర్షాన్ని లెక్కచేయకుండా వీఆర్ఏల నిరసన

By DK· 9h ago
వర్షాన్ని లెక్కచేయకుండా వీఆర్ఏల నిరసన

బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ సమ్మె 8వ రోజుకు చేరుకుంది. కుండపోత వర్షం కురుస్తున్నా టెంట్ ఏర్పాటు చేసుకుని నిరసన కొనసాగిస్తున్నారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హులకు ప్రమోషన్లు కల్పించాలని, నామినీ వీఆర్ఏలను వెంటనే గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించాలని కోరుతున్నారు. వర్షంలో తడుస్తున్నా డిమాండ్ల సాధన కోసం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

More in Local