← Back to news

300 మందికి స్కిల్ ట్రైనింగ్: కలెక్టర్

By DK· 13h ago
300 మందికి స్కిల్ ట్రైనింగ్: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో యువతకు, ముఖ్యంగా మహిళలకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో M/s Renew Pvt. Ltd. సంస్థతో శిక్షణ కార్యక్రమానికి సంబంధించి MoU కుదిరింది. తొలిదశలో 300 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అక్టోబర్ నుంచి అచ్యుతాపురంలోని APIIC ONE-STOP CENTREలో శిక్షణ ప్రారంభమవుతుందని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు.

More in Local