← Back to news

పాలకొండలో మౌలికవసతుల అభివృద్ధికి నిధులు

By DK· 12h ago
పాలకొండలో మౌలికవసతుల అభివృద్ధికి నిధులు

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీలో రూ.17 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించినట్లు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. HAM నిధులతో చేపట్టిన రోడ్లు, డ్రైన్లు, పార్కులు, వీధి దీపాల పనులకు శ్రీకారం చుట్టారు. పాలకొండ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం రూ.106.86 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రూ.79.86 కోట్ల పనులు కొనసాగుతుండగా, మరో రూ.27 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు.

More in Local