నాటుసారాపై ఉక్కుపాదం.. 7,000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం!

ఏపీ-ఒడిశా సరిహద్దులో అక్రమ నాటుసారా తయారీపై రెండు రాష్ట్రాల ఎక్సైజ్, పోలీసు అధికారులు సంయుక్త దాడులు చేశారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నందపూర్ బ్లాక్ పరిధిలోని ప్రధానిపుట్టు, ఒందురుగెడ్డ గ్రామాల్లో 7,000 లీటర్ల బెల్లం ఊట, 310 లీటర్ల అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ దాడుల్లో 53 మంది సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ మద్యం తయారీ, రవాణాపై నిరంతర నిఘా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.



