← Back to news

శ్మశానంలో పశువులు.. రైతుకు జరిమానా

By Bejjanki· 2h ago· Bejjanki, Bejjanki, Siddipet
శ్మశానంలో పశువులు.. రైతుకు జరిమానా

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం నర్సింహులపల్లి శ్మశానవాటిక పశువులకు నిలయమైంది. గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ కార్యదర్శి మునీర్ స్పందించారు. శ్మశానంలో పశువులను ఉంచిన రైతు జంగపల్లి శ్రావణ్‌కు రూ.వెయ్యికి పైగా జరిమానా విధించారు. నిబంధనలు అమలు చేస్తున్నామని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతామని ఆయన తెలిపారు. ఇకపై ఎవరైనా పశువులను ఉంచితే జరిమానా తప్పదని హెచ్చరించారు.

More in Local