'మౌంట్ తరంగ్' శిఖరాన్ని ఎక్కిన కామారెడ్డి విద్యార్థి

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లాపూర్ తండాకు చెందిన గురుకుల విద్యార్థి విశ్రావత్ బన్నీ అరుదైన విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని 6,027 మీటర్ల ఎత్తైన 'మౌంట్ తరంగ్' శిఖరాన్ని 10 మంది టీమ్‌తో కలిసి ఎక్కారు. గతంలో కిలిమంజారో వంటి పెద్ద పెద్ద పర్వతాలను కూడా ఎక్కిన బన్నీకి గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి అభినందనలు తెలిపారు.



