టైమ్‌కి గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సిందే

గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతీ ఒక్కరికీ టైమ్‌కి సిలిండర్ డెలివరీ చేయాలని TDP లీడర్ దొన్ను దొర, GCC చైర్మన్ శ్రావణ్ కుమార్ అధికారులను కోరారు. పెదబయలు GCC ఆఫీస్, పెట్రోల్ బంక్‌లను వాళ్లు తనిఖీ చేశారు. విలేజ్‌లలో లేట్ కాకుండా గ్యాస్ సప్లై చేయాలని, అధికారుల నిర్లక్ష్యం వల్ల గవర్నమెంట్‌కి చెడ్డపేరు రాకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో TDP నేతలు, GCC సిబ్బంది పాల్గొన్నారు.



