మలయాళీలు మీడియాలో వచ్చినదంతా నమ్మేస్తారు: పాల్ జకారియా

మలయాళీలు మీడియాలో వచ్చినదంతా ఆలోచించకుండా నమ్మేస్తారని ప్రముఖ రచయిత పాల్ జకారియా అన్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మీడియా రచయితలను పెద్దవాళ్లుగా చూపిస్తే, ప్రజలు కూడా అదే నమ్మేస్తారని అన్నారు. ఎమ్.టి.వాసుదేవన్ నాయర్(ప్రసిద్ధ మలయాళ రచయిత, సినీ దర్శకుడు) ఏదైనా చెబితే, అది గొప్ప రాజకీయ జ్ఞానంగా భావిస్తారని అన్నారు. వార్తాపత్రికల మధ్య పోటీ వల్ల ఇలా జరుగుతోందని అభిప్రాయపడ్డారు. రచయితలకు రాజకీయ బాధ్యత ఉంటుందని ఆయన అన్నారు.



