వరంగల్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం వరంగల్‌లోని గోపాలస్వామి గుడి జంక్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించారు. KUDA చైర్‌పర్సన్, GWMC మాజీ మేయర్ గుండు సుధారాణి, శాసనమండలి సభ్యులు బసవరాజు సారయ్య, పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద, DCC అధ్యక్షులు ఎండి. అయూబ్ తదితరులు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


