ఒక్క విద్యార్థి కోసం..ఆ టీచర్ చేస్తున్న పని అమోఘం!

ఒకే ఒక్క విద్యార్థికి పాఠాలు చెప్పేందుకు మహారాష్ట్రకు చెందిన టీచర్ చేస్తున్న పని అందరినీ ఆకట్టుకుంటోంది. కొల్హాపూర్ జిల్లాలోని కవల్టెక్ ధంగర్వాడ పాఠశాలలో 55 ఏళ్ల జీవన్ మిథారి 13 ఏళ్లుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం మూడో తరగతి విద్యార్థిని స్వరా బోడకే ఒక్కరే ఆ బడిలో చదువుతోంది. తనకోసం రోజూ బడికి వెళ్తున్నారు జీవన్ మిథారి. రోడ్డు లేకపోవడంతో అడవి మార్గంలో నడుస్తూ, రోజూ 5 కి.మీల ట్రెక్కింగ్ చేస్తూ బడికి వెళ్లి పాఠాలు చెప్తున్నారాయన.


