← Back to news

"అమిత్ షా రావాల్సిందే".. ప్రతిపక్షం వాక్‌అవుట్!

By Nani· 30 Jul 2026
"అమిత్ షా రావాల్సిందే"..  ప్రతిపక్షం వాక్‌అవుట్!

పేపర్ లీక్ ఇష్యూ ఇంకా పార్లమెంట్‌ను వదలట్లేదు. నిన్న లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌తో హీట్ పెరగగా.. ఇవాళ అదే ఇష్యూపై రాజ్యసభలో కూడా రచ్చ కొనసాగింది. "జూలై 20న విద్యార్థులపై పోలీసులు ఎందుకు బలప్రయోగం చేశారు..? అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలి" అంటూ ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. సమాధానం ఇవ్వాలంటూ పట్టుబట్టిన వారు చివరకు సభ నుంచి వాక్‌అవుట్ చేశారు. మరోవైపు.. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరగనుంది.

More in Politics