బోడిపాలెంలో ఉచిత మెగా వైద్య శిబిరం

AP: గుండె సంబంధిత వ్యాధులపై ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తూ గుంటూరు జిల్లా కాకుమాను మండలం బోడిపాలెం గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ పంచాయతీ వద్ద డాలు మోహన్‌రావు ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన హెల్ప్ హాస్పిటల్ వైద్యులు శనివారం శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో గుండె పరీక్షలతో పాటు ఈసీజీ, 2డీ ఎకో స్కానింగ్ నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. అవసరమైన వారికి యాంజియోగ్రామ్ పరీక్షలు చేసి వైద్య సేవలు అందించారు.