ఇళయరాజాపై పోస్టల్ స్టాంప్

సినీ సంగీతంలో 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. 50 ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని గుర్తిస్తూ ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. ఈ గౌరవంపై ఇళయరాజా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, పార్లమెంట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడులోని చిన్న గ్రామం నుంచి వచ్చి ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో గౌరవం పొందడం తనను ఎంతో కదిలించిందని చెప్పారు.



