ఓటర్ల సమస్యలపై ప్రకాష్ రాజ్ ఆందోళన!
కర్ణాటకలోని కలబురగి రామ్‌నగర్ కాలనీలో నటుడు ప్రకాష్ రాజ్ స్థానికులతో మాట్లాడారు. ఇక్కడ దాదాపు 5,21,957 ఓట్లు ASDDO జాబితాలో ఉన్నాయని, ఎన్నికల కమిషన్ సరిగ్గా ప్రచారం చేయకపోవడంతో ఇప్పటివరకు కేవలం 25 వేల మందే ఫారమ్-6 సబ్మిట్ చేశారని తెలిపారు. ప్రముఖుల ఓట్ల సమస్యల పై మాత్రమే స్పందిస్తున్న అధికారులు, సాధారణ ప్రజల ఓటు హక్కును పట్టించుకోవాలని.. ప్రతి ఒక్కరి ఓటు సమానమేనని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు.


