← Back to news

ఆటో కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయండి..!

By chandrashekar· 1d ago· Vemsoor, Vemsoor, Khammam
ఆటో కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయండి..!

ఖమ్మం జిల్లా వేంసూరులో ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ 2వ మండల మహాసభ జరిగింది. డంకర శ్రీను అధ్యక్షతన ఈ సభ నిర్వహించారు. CITU రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు మాట్లాడుతూ.. ఆటో రవాణా కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులు ఐక్యమైతే పాలకులు దిగొస్తారని, ఆగస్టు 20న తలపెట్టిన ఆటో బంద్ దాన్ని రుజువు చేసిందని ఆయన అన్నారు. రూ.12 వేల హామీని అమలు చేయాలని కోరారు. హామీలు కాగితాలకే పరిమితం కాకూడదన్నారు.

More in Local