← Back to news

వినాయక మండపం పనుల్లో విషాదం

By DK· 2d ago
వినాయక మండపం పనుల్లో విషాదం

TG: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. వెల్జాల్‌కు చెందిన కూరాకుల రాఘవేందర్ అలియాస్ రాకేష్ బీసీ కాలనీ 2వ వార్డులోని హనుమాన్ దేవాలయం సమీపంలో గణేశుడి మండపం ఏర్పాటు పనుల్లో పాల్గొన్నాడు. కట్టెలను రంపం యంత్రంతో కట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు యంత్రం చేతితోపాటు ఛాతీకి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు.

More in Local