విషాదం.. బస్సు కింద పడి వ్యక్తి మృతి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పురుషోత్తపట్నం అడ్డరోడ్డు వద్ద విషాదం జరిగింది. తిరుపతి నుంచి రాజమండ్రి వెళ్తున్న RTC బస్సు బార్‌గేట్స్ వద్ద నెమ్మదించిన సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బస్సు వెనుక టైరు కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై ఎంక్వేరీ చేస్తున్నట్లు తెలిపారు.



