సీసీ కెమెరాలతో నేరాలకు అడ్డుకట్ట: SI

AP: దొంగతనాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గుత్తి ఎస్‌ఐ అమిర్ ఖాన్ సూచించారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కేఎస్ అవెన్యూలో మంగళవారం రాత్రి నిర్వహించిన ప్రజల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పట్టణంలో చోటుచేసుకున్న దొంగతనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని, అనుమానం కలిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వెంచర్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 100కు ఫోన్ చేయాలని సూచించారు.




