← Back to news

చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి మృతి

By DK· 1d ago· జనగాం జిల్లా
చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి మృతి

జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామానికి చెందిన బాలగని కుమార్ (40) చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కుమార్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే ఆయన మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

More in Local