సచివాలయంలో ఇంటర్నెట్ కట్!

TG: తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు కట్ అవడంతో పలు ప్రభుత్వ శాఖల్లో పనులు నిలిచిపోయాయి. ముఖ్యంగా ప్రజా సేవలకు సంబంధించిన పనులు పనులు ఆగిపోయాయి. మీడియా సెంటర్, పబ్లిసిటీ సెల్, NRI అసిస్టెన్సీ సెల్ వంటి విభాగాల్లోనూ ఇంటర్నెట్ పనిచేయలేదు. దీంతో అధికారులు, సిబ్బంది ఆన్‌లైన్ ఆధారిత పనులు కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటర్నెట్ సేవలను తిరిగి ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.


