← Back to news

బిజినేపల్లిలో రాజ్యాధికార పాదయాత్ర విజయవంతం: సత్యశీల సాగర్

By వేముల ప్రవీణ్· 1d ago· Nagarkurnool

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు రాజకీయంగా ఐక్యంగా నిలవాలని బీసీ సంఘం బిజినేపల్లి మండల అధ్యక్షుడు వేముల సత్యశీల సాగర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ రాజ్యాధికార పాదయాత్ర నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలానికి చేరుకున్న సందర్భంగా స్వాగతం పలికిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్ర, బహిరంగ సభ విజయవంతానికి అన్ని గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారని చెప్పారు.

More in Local