కురవిలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి. గవర్నమెంట్ విప్, డోర్నకల్ MLA డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ఈ ప్రోగ్రామ్‌కి గెస్ట్‌గా వచ్చి ఐలమ్మ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలు, బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన ఫైట్ ఇప్పటి తరానికి పెద్ద ఇన్‌స్పిరేషన్ అని MLA చెప్పారు. ఈ ప్రోగ్రామ్‌లో కాంగ్రెస్ లీడర్లు, రజక సంఘం నేతలు, ఊరి జనం పాల్గొన్నారు.



