అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలి

వరదల ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసి ప్రజలకు తక్షణ సాయం అందించాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. చింతూరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. వర్షాలు తగ్గినందున వ్యవసాయ పొలాల్లో నిలిచిన నీటిని తొలగించాలని వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల శాఖలను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లోని నివాసాల్లోనూ నీటిని తొలగించాలన్నారు.



