“కుక్కలం కాదు.. పౌరులం”: నేహా బోరా
ఢిల్లీలోని నరైనా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన నేహా బోరా పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. 'మనల్ని కుక్కల్లా చూస్తున్నారు. వాహనాల్లోకి ఎక్కించి ఎక్కడికైనా తీసుకెళ్లడం సరికాదు. మనం ఈ దేశ పౌరులం. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడం, మన హక్కుల కోసం ప్రొటెస్ట్ చేయడం మన హక్కు' అని అన్నారు. ప్రొటెస్ట్ చేసినందుకు డిటైన్ చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొటెస్ట్ చేసినా మళ్లీ డిటైన్ చేస్తున్నారని, నిరసన తెలిపే హక్కు తమకుందని అన్నారు.

