పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలని మహా పాదయాత్ర
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఉల్పర గ్రామం నుంచి మహాపాదయాత్ర ప్రారంభమైంది. జిల్లా ప్రాజెక్టుల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్రను ప్రొఫెసర్ హరగోపాల్ ప్రారంభించారు. డిండి ప్రాజెక్ట్‌ను రద్దుచేసి పాలమూరు ప్రాంతానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతలతో పాటు ఇతర పథకాలను త్వరగా పూర్తిచేయాలన్నారు.



