కోహెడలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు నిర్వహించారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయమని నాయకులు తెలిపారు. బాపూజీ ఆశయాలను కొనసాగిస్తూ బహుజన రాజ్య స్థాపన కోసం నేటి తరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.



