గుంతకల్లుకు 39 కోట్ల డెవలప్‌మెంట్ పనులు!

అనంతపురం జిల్లా గుంతకల్లు డెవలప్‌మెంటే లక్ష్యమని MLA గుమ్మనూరు జయరాం అన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.39 కోట్ల పనులకు భూమిపూజ చేశారు. తాగునీటి పైప్‌లైన్లు, డ్రైనేజీ, సీసీ డ్రెయిన్లు, బీటీ–సీసీ రోడ్లు, నీటి ట్యాంకుల ఆధునీకరణ, ఎల్‌ఈడీ వీధిదీపాలు, పట్టణ సుందరీకరణ జరుగుతాయి. నాణ్యతతో గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో గుమ్మనూరు నారాయణస్వామి, జనసేన ఇన్‌చార్జ్ వాసగిరి మణికంఠ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.




