సరదా కాస్తా ప్రమాదంగా మారొచ్చు! ⚠️

బర్త్‌డేలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లలో స్నో స్ప్రే కొట్టడం ఇప్పుడు ఒక ట్రెండ్‌లా మారింది. కానీ ఇది చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ స్ప్రేలలో బ్యూటేన్, ప్రొపేన్ లాంటి కెమికల్స్ ఉంటాయి. కొవ్వొత్తులు, దీపాల దగ్గర కొడితే వెంటనే మంటలు అంటుకునే అవకాశం ఉంది. అంతేకాదు, నేరుగా ముఖంపై స్ప్రే చేయడం వల్ల కళ్లు దెబ్బతినడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్కిన్ అలెర్జీలు వస్తాయని చెప్తున్నారు. సరదా కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు.



