నిరుద్యోగులకు ఉచిత స్కిల్ ట్రైనింగ్

ములుగు జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ములుగు TASK ప్రాంతీయ కేంద్రంలో ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. 30 రోజుల తరగతులతో పాటు 7 రోజుల ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. Banking, Financial Services, Insurance రంగాల శిక్షణకు ఇంటర్, డిగ్రీ ఆపై విద్యార్హతలు అవసరం. అక్టోబర్ 31లోగా TASK కేంద్రంలో నమోదు చేసుకోవాలని, వివరాలకు 9490500282, 9618449360 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.



