← Back to news

మంత్రి బినామీ భూకబ్జాలు బయటపెట్టిన CPI నారాయణ!

By sahani· 9 Jul 2026· AndhraPradesh

ఆంధ్రప్రదేశ్‌లో భూకబ్జాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతి సమీపంలోని అవిలాల, పరిసర ప్రాంతాల్లో విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయని CPI నేత నారాయణ ఆరోపించారు. గతంలో ఓ RDO కొనుగోలు చేసిన భూమిని సైతం, తమదేనంటూ టీడీపీ లీడర్స్ లాక్కుంటున్నారని మండిపడ్డారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రమేయం లేకుండా ఇది జరగదని, ఆయన బినామీ అయిన దొనేపూడి శివనాగప్రసాద్ పేరుతోనే ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగిందని నారాయణ సంచలన కామెంట్స్ చేశారు.

More in News