← Back to news

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం నిర్వహించాలి: సీపీ

By Sagar· 15h ago· Ramagundam, Ramagundam, Peddapalli
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం నిర్వహించాలి: సీపీ

పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలు చోటుచేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిమజ్జనం సమయంలో ఉత్సవ నిర్వాహకులు, కమిటీ సభ్యులు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

More in Local