← Back to news

జనవరి 1 నుంచి హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్..!

By Jagadish· 2d ago
జనవరి 1 నుంచి హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్..!

అమరావతిలో CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో జనవరి 1 నుంచి ప్రజల ఆరోగ్య రికార్డులను పూర్తిగా డిజిటలైజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇది వైద్య రంగంలో గేమ్‌చేంజర్ అవుతుందన్నారు. విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి రూ.249 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు వర్చువల్‌గా ప్రారంభమయ్యాయి. 500 అదనపు క్రిటికల్ కేర్ బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. అమరావతి క్వాంటం బయో వ్యాలీకి జాతీయ గుర్తింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

More in Politics