ఆదిలాబాద్లో వందల కోట్ల పెట్టుబడుల మోసం

TG: ఆదిలాబాద్లో వందల కోట్ల పెట్టుబడుల మోసం వెలుగు చూసింది. యూనిక్ సంస్థల పేరుతో అధిక లాభాల ఆశ చూపి ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 10 వేల మంది బాధితులు ఉన్నట్లు ప్రాథమిక అంచనాలో తేలింది. తెలంగాణలో 14 కేసులు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో 2,000 మంది నుంచి రూ.7–8 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

