← Back to news

నర్సింగ్ కాలేజీలో ఫర్నిచర్ ధ్వంసం.. NSUI కార్యకర్తల అరెస్ట్

By A.Ajay· 2h ago

TG: హైదరాబాద్‌ L.B. నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మన్సూరాబాద్‌ కేర్‌ నర్సింగ్‌ కాలేజీలో NSUI కార్యకర్తలు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. విద్యార్థులకు సరైన వసతులు లేవంటూ వారు నిరసన చేపట్టారు. కాలేజీ యాజమాన్యం నిలదీయడంతో తిరిగి గుంపుగా వచ్చి దాడి చేశారు. యాజమాన్యం కంప్లయింట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించగా, మరో నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.

More in TG