రైతు, కార్మిక సంఘాల డిమాండ్
'ఆర్నాబ్' తుపాను వల్ల నష్టపోయిన రైతులను, ఇబ్బంది పడుతున్న ప్రజలను వెంటనే ఆదుకోవాలని రైతు, కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేగిడి ఆమదాలవలస మండలం పుర్లి, పుర్లిపేట గ్రామాల్లో తుపాను ధాటికి నీట మునిగిన ఇళ్లు, వందల ఎకరాల వరి పొలాలను వారు పరిశీలించారు. వర్షాలు, నాగావళి నది వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.



