వరంగల్‌లో భారీ వర్షాలు.. అధికారులకు అలర్ట్!

వరంగల్ జిల్లాలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నర్సంపేట, రాయపర్తి మండలాల్లో అతి భారీ వర్షాలు పడొచ్చని అంచనా. మిగతా ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అధికారులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ముందస్తు చర్యలపై సమీక్షించారు. చెరువులు, కాలువలు, వంతెనలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రభుత్వ విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.



