బాధిత కుటుంబానికి మేస్త్రి సంఘం చేయూత

హన్మకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన నామోజు శ్రీను అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ మేస్త్రి సంఘం సభ్యులు శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీను చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకుని, కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మేస్త్రి సంఘం సభ్యులు తమ వంతు సహాయంగా రూ.9,500 ఆర్థిక సాయం అందించారు.



