రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్.. సామాన్యులకు అందుబాటులో!

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఆధునిక వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. ఫెర్నాండెజ్ హాస్పిటల్‌లో రోబోటిక్ జాయింట్ రిప్లేస్‌మెంట్, అడ్వాన్స్‌డ్ సర్జికల్ కేర్ సేవలను మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రారంభించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా హాజరయ్యారు. రోబోటిక్ టెక్నాలజీతో శస్త్రచికిత్సల్లో మరింత ఖచ్చితత్వం సాధిస్తారు. 3D సర్జికల్ ప్లానింగ్‌తో ఖర్చులు తగ్గుతాయని మంత్రి తెలిపారు. జర్మన్ టెక్నాలజీ ఆధారంగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక వైద్యం గ్రామీణులకూ అందాలని మంత్రి సూచించారు.



